నేను చైతూ గురించి బాధపడితే, చైతూ నా గురించి బాధపడేవాడు: నాగార్జున

  • 'బంగార్రాజు'లో కలిసి నటించిన నాగ్, చైతూ
  • ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ
  • ఆసక్తికర అంశాలు వెల్లడించిన నాగ్
నాగచైతన్య, సమంతల దాంపత్యం కొన్నాళ్లకే విచ్ఛిన్నం కావడం పట్ల ఎక్కువగా బాధపడిన వ్యక్తి నాగార్జున. వారిద్దరూ విడిపోవడాన్ని నాగార్జున ఓ దురదృష్టకరమైన ఘటనగా భావిస్తుంటారు. కాగా, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు' ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో నాగార్జున పాల్గొన్నారు. విడాకుల ప్రకటన సమయంలో తన కుమారుడు నాగచైతన్య పరిస్థితిని వివరించారు.

నాగచైతన్య ఎక్కడా సహనం కోల్పోలేదని, ఎంతో ప్రశాంతంగా కనిపించాడని నాగ్ వెల్లడించారు. ఎంతో సంయమనంతో వ్యవహరించిన చైతూని చూసి గర్వంగా అనిపించిందని తెలిపారు. కానీ ఓ తండ్రిగా చైతూ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయానని అన్నారు. చైతూ మాత్రం అనుక్షణం నా గురించి బాధపడేవాడు అని నాగార్జున వివరించారు.

కాగా, ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఆసక్తికరంగా స్పందించారు. వెండితెరపై మీకు సరైన జోడీ ఎవరని ప్రశ్నించగా, సమంత అని జవాబిచ్చారు. సమంతతో తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదురుతుందని వెల్లడించారు.

Nagarjuna
Naga Chaitanya
Samantha
Bnagarraju
Tollywood

More Telugu News